కరోనా సోకుతుందని మహిళా డాక్టర్ ను తిట్టాడు..వీడియో వైరల్

  • Publish Date - April 6, 2020 / 11:38 AM IST

భారతదేశాన్ని కరోనా భయపెడుతోంది. నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 మందికి పైగానే మృత్యువాత పడుతున్నారు. ప్రాణాలకు తెగించి  వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రతొక్కరూ వీరి సేవలకు సలాం అంటూ జై కొడుతున్నారు. కానీ కొంతమంది తమ నీచపు బుద్ధిని చాటుతున్నారు. మహిళా వైద్యులను వేధించడం, వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో అయితే సరైన ఎక్విప్ మెంట్స్ లభించక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్న ఓ మహిళా డాక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

సూరత్ సివిల్ హాస్పిటల్ లో మహిళా డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈమె నివాసం ఉంటున్న వ్యక్తి ఆమెపై దురుసుగా ప్రవర్తించాడు. తిట్ల పురాణం అందుకున్నాడు. ఆమె వల్ల తమకు కరోనా వైరస్ సోకుతుందని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. వైద్యురాలు దీని మొత్తాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశారు. దీనిని చూసిన ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. సెల్ ఫోన్ గుంజుకొనేందుకు, దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

ఇంట్లోని వారు ఆపేందుకు ప్రయత్నించినా అతను వినిపించుకొనే స్థితిలో లేడు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అతనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

దీనిపై కాంగ్రెస్ నేత శ్రీవత్స రెస్పాండ్ అయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కోరారు. పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ లభించక ఇబ్బందులు పడుతున్న వైద్యులు.. ఇప్పుడు సమాజంలో కూడా ఒంటరి కావాల్సి వస్తుందని ఆయన తెలిపారు.