Karnataka: సిద్ధరామయ్య ‘కుక్కపిల్ల’ వ్యాఖ్యలకు అదే తరహాలో బదులిచ్చిన సీఎం బొమ్మై

మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్‌ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రానికి ఇవ్వలేదు. ఈ విషయాలను ప్రధాని మోడీ ముందు ప్రస్తావించటానికి సీఎం బసవరాజ్ బొమ్మైకు గానీ కర్ణాటక బీజేపీ నేతలకు దమ్మూ ధైర్యం లేదు. ఎందుకంటే మోదీ ముందు సీఎం కూడా కుక్కపిల్లలా వణకాల్సిందే’’ అని అన్నారు.

Karnataka: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై సహా కర్ణాటక బీజేపీ నేతలంతా కుక్కపిల్లలేనంటూ విపక్ష నేత సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై సీఎం బొమ్మై అదే తరహాలో స్పందించారు. కుక్కలకు మాత్రమే విశ్వాసం గురించి తెలుసి ఉంటుందని, సిద్ధరామయ్య అందుకే ఆ వ్యాఖ్యలు చేశారంటూ తిప్పికొట్టారు. ‘‘ఇది సిద్ధరామయ్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నేను దీనిపై వ్యాఖ్యానించదలచుకోలేదు. కుక్కలు వారి విధేయతకు ప్రసిద్ధి చెందాయి. నేను ప్రజలకు విధేయతతో పని చేస్తున్నాను. అబద్ధాలు చెప్పి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వారిలా కాకుండా, నేను నమ్మకంగా పని చేస్తున్నాను’’ అని బొమ్మై అన్నారు.

Manikrao Thakre: మాణిక్కం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావ్ థాక్రే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్!

కాగా, మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్‌ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రానికి ఇవ్వలేదు. ఈ విషయాలను ప్రధాని మోడీ ముందు ప్రస్తావించటానికి సీఎం బసవరాజ్ బొమ్మైకు గానీ కర్ణాటక బీజేపీ నేతలకు దమ్మూ ధైర్యం లేదు. ఎందుకంటే మోదీ ముందు సీఎం కూడా కుక్కపిల్లలా వణకాల్సిందే’’ అని అన్నారు.

Sonia Gandhi: భారత్ జోడో యాత్రను వదిలి ఢిల్లీకి చేరిన రాహుల్

ట్రెండింగ్ వార్తలు