Dominos: వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.400 ఆఫర్ ఇస్తున్న డొమినోస్

ఇండియా మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని డోమినోస్ ప్రత్యేక ఉద్యమమే మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను...

Dominos: వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.400 ఆఫర్ ఇస్తున్న డొమినోస్

Dominos

Updated On : June 30, 2021 / 3:56 PM IST

Dominos: ఇండియా మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని డోమినోస్ ప్రత్యేక ఉద్యమమే మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రం సకల ఏర్పాట్లు చూసుకుంటున్నా ఎక్కడో ఒక మూల ఇంకా అవగాహన కల్పించాల్సిన వారు మిగిలే ఉంటున్నారు.

వారిలోనూ స్పృహను రగిలించడానికి వ్యాక్సిన్ వేసుకున్న వారికి రూ.400 వరకూ ఆఫర్ ఇస్తామని డోమినోస్ ప్రకటించింది. హాత్ బడావో ఇండియా.. వ్యాక్సిన్ లగావో ఇండియా అనే నినాదంతో వ్యాక్సినేషన్ ఉద్యమాన్ని ప్రారంభించింది.