కశ్మీర్ ను పాకిస్తాన్ లో చూపించిన జూనియర్ ట్రంప్
- venkaiahnaidu
- Updated on- November 4, 2020 / 10:00 AM IST
donald trump jr contraoversial tweet అమెరికా ఎన్నికల పలితాలు వెలువడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు.ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు ఉన్న మద్దతును తెలియజేసేలా ఆయన ప్రపంచ పటాన్ని ట్వీట్ చేశారు. అత్యధిక దేశాలను ఎరుపు రంగు (రిపబ్లికన్ పార్టీ రంగు)లో చూపిస్తూ ప్రపంచ పటాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
అయితే, భారత్, చైనా దేశాలను నీలి రంగు (బైడెన్ పార్టీ రంగు)లో చూపించారు. అంటే భారత్ ,చైనా...జో బైడెన్‌కు మద్దతిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యాప్ ఉంది. కానీ భారత్‌లో భాగమైన అరంతర్భాగమైన జమ్ముకశ్మీర్,ఈశాన్య రాష్ట్రాల్ని ఇందులో ఎరుపు రంగులో చూపారు. ఇది వివాదాస్పదంగా ఉంది.
