Donald Trump: ట్రంప్‌కు ‘ట్రూత్ సోషల్‌’ దెబ్బ.. ఏకంగా రూ.2,000 కోట్ల నష్టం.. ఇక దానిపైనే ఫోకస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

Donald Trump's Truth Social caught in 2000 crore financial crisis

  • ట్రూత్ సోషల్‌కు భారీ నష్టం
  • క్రిప్టో పతనమే ప్రధాన కారణం
  • సోషల్ మీడియాపై మళ్లీ ఫోకస్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీని మాతృ సంస్థ అయిన ‘ట్రంప్ (Donald Trump)మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’ (TMTG) రెండవ త్రైమాసికంలో ఏకంగా 238 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ.2,000 కోట్లు నికర నష్టాన్ని చవిచూసింది. కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ, క్రిప్టో కరెన్సీలు, డిజిటల్ అసెట్స్ మార్కెట్‌లో సంభవించిన భారీ పతనం ఈ ఘోర నష్టానికి ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Petrol Prices: వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

క్రిప్టోను పక్కనపెట్టి సోషల్ మీడియాపై ఫోకస్:

ఈ భారీ ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కంపెనీ సీఈఓ కెవిన్ మెక్‌గర్న్ కీలక ప్రణాళికలను వెల్లడించారు. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్, క్రిప్టో వంటి ప్రమాదకర వ్యాపార రంగాలను పక్కన పెట్టి, తిరిగి తమ మూల వ్యాపారమైన సోషల్ మీడియా అభివృద్ధిపైనే పూర్తి దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవడంతో పాటు వినియోగదారుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా సరికొత్త విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

‘ట్రూత్ ఏపీఐ’తో ఆదాయం పెంచుకునే ప్లాన్:

ఆదాయ మార్గాలను విస్తరించడంలో భాగంగా ‘ట్రూత్ ఏపీఐ’ సర్వీస్‌ను విస్తరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ సహా ముఖ్యుల పోస్టులను ఇతరుల కంటే కొన్ని మిల్లీసెకన్ల ముందే చూసేలా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థలకు ముందస్తు యాక్సెస్ ఇస్తున్నారు. దీని కోసం నెలకు 60,000 నుండి 1,00,000 డాలర్ల వరకు రుసుము వసూలు చేస్తుండగా, ఇప్పటికే 10 హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. భవిష్యత్తులో ఈ సర్వీస్‌ను వార్తా సంస్థలకు, డేటా సెంటర్లకు సైతం పొడిగించనున్నారు.