ఇకపై భవిష్యత్ యుద్ధాల్లో ఈ DEWS ఆయుధాలే.. DRDO

  • Publish Date - September 14, 2020 / 11:46 AM IST

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) హై-ఎనర్జీ లేజర్స్ హై-పవర్ మైక్రోవేవ్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ విపన్స్ (DEWS) అభివృద్ధి చేయడానికి యోచిస్తోంది. నేషనల్ ప్రొగ్రామ్‌లో ఒక భాగమైన DEWS ద్వారా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించవచ్చు.



DRDO దేశీయ పరిశ్రమ సహకారంతో 100 కిలోవాట్ల శక్తితో వివిధ DEWS వేరియంట్లను అభివృద్ధి చేస్తోంది. క్షిపణులు, విమానాల్లో నైపుణ్యాల కోసం సీక్రెట్ ‘Kali’ particle-beam, అలాగే hemical oxygen-iodine’ ‘హై-పవర్ ఫైబర్’ లేజర్‌లు ఇందులో ఉంటాయి. ఈ DEWS ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదు.
https://10tv.in/india-successfully-tests-hypersonic-missile/
DRDO రెండు యాంటీ-డ్రోన్ DEW వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇప్పుడు దేశీయ పరిశ్రమ సాయంతో పెద్ద సంఖ్యలో తయారు చేస్తోంది. ఒకటి ట్రెయిలర్-మౌంటెడ్ DEW, 10 కిలోవాట్ల లేజర్‌తో ఒకటి ట్రెయిలర్-మౌంటెడ్ DEW అయితే, 2 కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను చేధించడానికి 10 కిలోవాట్ల లేజర్‌తో అవసరం పడుతుంది. మరొకటి కాంపాక్ట్ త్రిపాద-మౌంటెడ్ 1కిలోమీటర్ పరిధికి 2 కిలోవాట్ల లేజర్‌తో అవసరం పడుతుంది.



ఈ DEWS ను సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు క్షేత్ర దళాల కోసం ప్రవేశపెట్టారు. రెండు వ్యవస్థలు మైక్రో డ్రోన్‌లను వారి కమాండ్, కంట్రోల్ లింక్‌లను జామ్ చేస్తుంది. లేజర్-ఆధారిత DEWS ద్వారా వాటి ఎలక్ట్రానిక్‌లను దెబ్బతీస్తుంది.



ఏదేమైనా, ఈ DEWS యుఎస్, రష్యా, చైనా, జర్మనీ మొదలైన దేశాలలో అభివృద్ధి చేసినంత శక్తివంతమైనవి కాదని చెప్పొచ్చు. వచ్చే దశాబ్దానికి భారత రక్షణ సంస్థ సాంకేతిక రోడ్‌మ్యాప్ ఆర్మీ, ఐఎఎఫ్‌లకు కనీసం 20 ‘వ్యూహాత్మక హై-ఎనర్జీ లేజర్ వ్యవస్థలు అవసరమని చెప్పారు.



మొదటి దశలో 6-8 కిలోమీటర్ల పరిధిలో చిన్న వైమానిక లక్ష్యాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, రాడార్ వ్యవస్థలను నాశనం చేయగల సామర్థ్యం ఉంది. రెండవ దశలో నేల, వైమానిక వేదికల నుంచి 20కిలోమీటర్ల మేర తరలించేందుకు సైనిక బలగాలు, తేలికైన వాహనాలను తీసుకెళ్లేందుకు ఈ లేజర్ వ్యవస్థలను వాడుతారు.