Drone Delivers Pension : ఒడిశా రాష్ట్రం నౌపాడా జిల్లాలోని మారుమూల అటవీ గ్రామం భూత్కపాడలో డ్రోన్ ద్వారా పెన్షన్ పంపిణీ జరిగింది. డ్రోన్ ద్వారా హేతారామ్ సత్నామికి పెన్షన్ అందజేశారు సర్పంచ్ సరోజ్ అగర్వాల్. డ్రోన్ తో పెన్షన్ పంపిణీ.. ఇందులో పెద్ద గొప్ప విషయం ఏముంది? అనే సందేహం రావొచ్చు. కచ్చితంగా ఇందులో చాలా గొప్ప విషయం ఉంది.
అదో దట్టమైన అడవి. అక్కడ ప్రయాణం చాలా కష్టం. అలాంటి చోట నివాసం ఉంటాడు సత్నామి. పెన్షన్ కోసం ప్రతి నెల 2 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిని దాటుకుని వెళ్లాలి. పైగా వైకల్యంతో బాధపడుతున్నాడు. దాంతో ఈ ప్రయాణం సత్నామికి ప్రతి నెల కష్టంగా మారింది. సత్నామి సమస్యను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో పెద్ద మనసుతో డ్రోన్ కొనుగోలు చేశారు. ఆ డ్రోన్ ద్వారా సత్నామికి పెన్షన్ అందించారు. నేరుగా ఇంటి వద్దకే డ్రోన్ వెళ్లి పెన్షన్ అందేలా చూశారు.
ఇందులో మరో గొప్పదనం ఏంటంటే.. డ్రోన్ కొనుగోలులో ప్రభుత్వం చొరవ లేదు. తన సొంత నిధులతోనే సర్పంచ్ సరోజ్ అగర్వాల్ డ్రోన్ కొనుగోలు చేయడం విశేషం. సత్నామి సమస్యను తెలుసుకుని పెద్ద మనసుతో డ్రోన్ కొనుగోలు చేయడం నిజంగా అభినందనీయం అంటున్నారు స్థానికులు. సర్పంజ్ గొప్ప మనసుకు వారంతా ఫిదా అయ్యారు.
Also Read.. India ‘Varuna’ Drone : 130 కిలోల బరువు మోయగలిగే ‘వరుణ’ డ్రోన్..
సర్పంచ్ గారు మీరు సూపర్ అని కితాబిస్తున్నారు. డ్రోన్ ద్వారా పెన్షన్ పంపిణీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైకల్యంతో బాధపడుతున్న తన సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇంటి వద్దకే డ్రోన్ ద్వారా పెన్షన్ ఇవ్వడం పట్ల సత్నామి ఆనందం వ్యక్తం చేశాడు. సర్పంచ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సత్నామి అతడి కుటుంబసభ్యులు.
భలేశ్వర్ పంచాయతీ పరిధిలోని భూత్కపాడు గ్రామానికి చెందిన హేతారం సత్నామి రాష్ట్ర ప్రభుత్వ మధుబాబు పెన్షన్ యోజన లబ్ధిదారుడు. వికలాంగుల పింఛన్ తీసుకునేందుకు గ్రామ పంచాయతీకి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడు సత్నామి. ఇందుకోసం అతడు చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే, ఈసారి అతడికి అలాంటి కష్టం ఎదురువలేదు. డ్రోన్ పెన్షన్ తీసుకుని వచ్చింది. ఏకంగా తాను ఉంటున్న ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చి ఇచ్చింది. దీంతో సత్నామి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయాడు. అతడి ఆనందానికి అవధులు లేవు.
Also Read..Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
పెన్షన్ డబ్బుని ఓ పేపర్ కవర్ భద్రంగా ఉంచారు. దానికి ఓ దారాన్ని కట్టారు. ఆ దారాన్ని డ్రోన్ కి ముడి వేశారు. ఆ తర్వాత డ్రోన్ ని ఆపరేట్ చేశారు. గాల్లోకి ఎగిరిన డ్రోన్ ముందుకు సాగింది. సరిగ్గా లబ్దిదారుడి ఇంటి ముందు వెళ్లి ఆగింది. మనిషికి అందే ఎత్తులో డ్రోన్ ను కిందికి దించారు. అప్పటికే రెడీగా ఉన్న స్థానికులు.. డ్రోన్ కి కట్టి ఉన్న పేపర్ కవర్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న పెన్షన్ డబ్బుని తీసుకుని సత్నామికి అందజేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.