Foreign Drone Ban: విదేశీ డ్రోన్ల కొనుగోళ్లను నిషేదించిన ఇండియా

విదేశీ డ్రోన్ల కొనుగోలును భారత ప్రభుత్వం నిషేదించింది. దేశీయంగా తయారుచేసిన డ్రోన్లను ప్రమోట్ చేయడంలో భాగమే ఈ ప్రయత్నం అని పేర్కొంది. R&D, డిఫెన్స్, సెక్యూరిటీ ప్రయోజనాల కోసం..

Foreign Drone Ban: విదేశీ డ్రోన్ల కొనుగోళ్లను నిషేదించిన ఇండియా

Import Drone

Updated On : February 10, 2022 / 6:00 PM IST

Drone Import Banned: విదేశీ డ్రోన్ల కొనుగోలును భారత ప్రభుత్వం నిషేదించింది. దేశీయంగా తయారుచేసిన డ్రోన్లను ప్రమోట్ చేయడంలో భాగమే ఈ ప్రయత్నం అని పేర్కొంది. R&D, డిఫెన్స్, సెక్యూరిటీ ప్రయోజనాల కోసం డ్రోన్లను దిగుమతి చేసుకోవడాన్ని అందులో మినహాయింపు ఇచ్చారు. కానీ అటువంటి దిగుమతుల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. డ్రోన్ల ఎగుమతిని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నిషేదించినట్లుగా పేర్కొంది.

‘పూర్తిగా తయారైన డ్రోన్ ల దిగుమతి పాలసీని పూర్తిగా నిషేదించారు. కాకపోతే డ్రోన్ల విడి భాగాలు కావాలంటే ఎటువంటి అప్రూవల్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చు’ అని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది.

Read Also : మిర్చిసాగులో అనువైన విత్తన రకాలు

గవర్నమెంట్ సంస్థలు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు దక్కించుకున్న విద్యా సంస్థలు, R&D సంస్థలు డ్రోన్లను దిగుమతి చేసుకోవచ్చు. CBU, SKD, CKD రూపంలో మాత్రమే వాటిని అనుమతిస్తారు. దిగుమతి చేసుకోదలచిన వారు సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి తీసుకోవాలి.

ఆగష్టు 2021న రిలీజ్ చేసిన డ్రోన్ రూల్స్ కు 2022 ఫిబ్రవరి 9 నుంచి ఈ నిషేదం వర్తిస్తుంది.