Drugs Were Seized At Delhi Airport
drugs were seized at delhi airport : ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో గేట్ నెంబరు 11 లో పడేసి ఉన్న 51 కొకైన్ క్యాప్సూల్స్ ఉన్న కవర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్ చేశారు. వీటిని కస్టమ్స్ అధికారులు గుర్తిస్తారని అక్రమార్కులు అక్కడ పడవేసి పోయినట్లు భావిస్తున్నారు.
కాగా..ఈ డ్రగ్స్ ను అక్కడ ఎవరు పడేశారు?అనే విషయంపై అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ కొకైన్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తీసుకున్నారు? ఎవరు దీన్ని ఇక్కడ పడేసిపోయారు? అన్నదానిపై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పదిహేను కోట్ల విలువైన కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.