Kerala: పుల్లు తాగిన పోలీసు డ్రైవింగ్ చేస్తూ టూవీలర్‌కు యాక్సిడెంట్

డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించే పోలీసే తాగి వాహనం నడిపి ఇద్దరికి తీవ్ర గాయాలు కావడానికి కారణం అయ్యాడు. అసిస్టెంబ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాలో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో..

Alcohol (2)

Kerala: డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించే పోలీసే తాగి వాహనం నడిపి ఇద్దరికి తీవ్ర గాయాలు కావడానికి కారణం అయ్యాడు. అసిస్టెంబ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాలో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో కారు నడపడంతో బెయిలబుల్ అఫెన్స్ తో అరెస్టు చేశారు. సోమవారం రాత్రి పర్మిషబుల్ లిమిట్స్ కు మించి తాగి డ్రైవ్ చేశాడని మెడికల్ ఎగ్జామినేషన్ లో తెలిసింది.

ఏఎస్ఐ, ఇద్దరు స్నేహితులు కలిసి పీచి ఏరియాలో పార్టీకి వెళ్లి వచ్చే సమయంలో ఫుల్లుగా మద్యం తాగారు. టూ వీలర్ ను ఢీకొట్టి కూడా ఘటనాస్థలంలో ఆగకుండా వెళ్లిపోయారు. స్థానికులు వాహనం వివరాలు నమోదు చేసుకుని పోలీసులకు తెలియజేశారు.

బాధితులు భార్యాభర్తలు.. కాలికి తీవ్రగాయాలు కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఒకరికి సర్జరీ కూడా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి : పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి ఇతనే!