Indian Hindu Doctor: ముస్లిం పేషెంట్ కోసం హిందూ డాక్టర్ ఇస్లామిక్ ప్రార్థన

ప్రపంచవ్యాప్తంగా అందరికీ కావాలసింది ఫిజికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు ఆధ్యాత్మిక ట్రీట్మెంట్ కూడా. అదే మానవత్వానికి నిదర్శనం కూడా.

Indian Hindu Doctor: ప్రపంచవ్యాప్తంగా అందరికీ కావాలసింది ఫిజికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు ఆధ్యాత్మిక ట్రీట్మెంట్ కూడా. అదే మానవత్వానికి నిదర్శనం కూడా. మతపరమైన హద్దులు లేవని నిరూపిస్తూ హిందూ డాక్టర్ 57ఏళ్ల ముస్లిం రోగి కోసం ప్రార్థన చేసింది.

కేరళలోని సెవనా హాస్పిటల్ లో మే 17న ఈ ఘటన జరిగింది. డా.రేఖా హిళ కృష్ణా(37) అనే మహిళ దుబాయ్ లోనే పుట్టి పెరిగారు. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్లకు చికిత్స అందిస్తుండగా ఒక పేషెంట్ కు 17రోజుల తర్వాత ఒక్కో అవయవం పాడైపోతున్నట్లు గమనించారు.

కొవిడ్ 19 న్యూమోనియాతో బాధపడుతున్న మహిళ తరపు కుటుంబ సభ్యులు కానీ బంధువులను గానీ ఐసీయూలోకి అనుమతించలేదు.

ఒక డాక్టర్ గా ఆమె బాధను గమనించాను. ఆమె అవయవం ఒక్కొక్కటిగా పాడవడం మొదలైంది. బాధను గమనించి వెంటిలేటర్ మీద నుంచి తీసేసిన తర్వాత ఉన్న కొద్ది క్షణాల్లో కలిమా చెప్పాను. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని వినిపించాను.

నేను అలా చేయాలని ముందుగా అనుకోలేదు. దయతో అనుకోకుండా జరిగింది. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు మానవత్వంతో చేసిన పని మాత్రమే.అని ఆ డాక్టర్ అంటున్నారు. “

ట్రెండింగ్ వార్తలు