Jammu Earthquake
Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్ (jammu and kashmir) లో అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. కత్రా పట్టణం (Katra town) లో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత 2.20 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. కత్రాకు 81 కిలో మీటర్ల దూరంలో ఉన్న 10కిలో మీటర్ల లోతులో భూమి కపించింది. ఈ భూకంప ప్రభావంతో ఢిల్లీలోనూ పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటలకు కత్రా పట్టణంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట్ లో పేర్కొంది. అర్థరాత్రి వేళ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. రాత్రంతా స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు.
Jammu and Kashmir Earthquake: జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదు
మంగళవారం మధ్యాహ్నం1.30 గంటలకు భారతదేశం, పాకిస్థాన్, చైనాలో బలమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఢిల్లీ – ఎన్‌సీఆర్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రికర్టు స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం, మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత వరుసగా భూకంపాలు రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Yoga Break: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకనుంచి ‘యోగా బ్రేక్’.. ఉత్తర్వులు జారీ
ఎన్‌సీఎస్ వివరాల ప్రకారం.. మే నెలలో భారతదేశంలో 41 సార్లు భూకంపం సంభవించింది. వీటిలో ఉత్తరాఖండ్ లో ఏడు, మణిపూర్ లో ఆరు భూకంపాలు సంభవించాయి. ఇదికాకుండా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సార్లు భూమి కంపించింది. హర్యానా, మేఘాలయాల్లో మూడేసి సార్లు భూమి కంపించింది.