Earthquake : ఖట్మండులో మళ్లీ భూకంపం…తీవ్రత ఎంతంటే…

నేపాల్‌లోని ఖాట్మండులో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నేపాల్‌లోని ఖాట్మండులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో నమోదైంది....

Earthquake

Earthquake : నేపాల్‌లోని ఖాట్మండులో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నేపాల్‌లోని ఖాట్మండులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో నమోదైంది. నేపాల్‌ దేశంలోని ఖాట్మండు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

Also Read : Kangana Ranaut : ఢిల్లీలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయబోయే తొలి సెలిబ్రిటీ ఎవరంటే…

ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం వివరాలు తెలియలేదు. ఖట్మండులో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఆదివారం నేపాల్‌లో 6.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం నమోదైంది. తరచూ భూకంపాలతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Also Read : Hamas releases : హమాస్ సంచలన నిర్ణయం…మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీల విడుదల