Uttar Pradesh
Uttar Pradesh : గతంలో ‘బాహుబలి’ సమోసా గురించి విన్నారు కదా.. ఉత్తప్రదేశ్ మీరట్‌లో కౌశల్ షాప్ అని చెప్తే ఎవరైనా అడ్రస్ చెబుతారు. అక్కడే మాత్రమే ఈ సమోసా దొరుకుతుంది. విషయం ఏంటంటే అక్కడ 12 కిలోల సమోసాను 30 నిముషాల్లో తింటే రూ.71,000 ప్రైజ్ మనీ ఇస్తారట.
Unique Samosa shop : ఆ సమోసా షాపు పేరు ‘నమ్మకద్రోహం’.. పేరు వెనుక కథా.. ఆ సమోసాల రుచి భలే ఇంట్రెస్టింగ్
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో ఉంది కౌశల్ షాప్. ఇక్కడే బాహుబలి సమోసా దొరుకుతుంది. ఇటీవల కాలంలో ఇక్కడ చాలామంది తమ పుట్టినరోజులకి కేక్స్ కట్ చేయడం మానేసి సమోసాలు కట్ చేస్తున్నారట. అందుకోసం భారీ లెవెల్లో ఆర్డర్లు కూడా వస్తున్నాయట. లాల్‌కుర్తికి చెందిన కౌశల్ స్వీట్స్ షాపు మూడవతరం యజమాని శుభమ్ కౌశల్ ఈ సమోసాను వెలుగులోకి తీసుకువచ్చారు.
బాహుబలి సమోసా తయారు చేయడానికి చెఫ్‌లకు ఆరుగంటల సమయం పడుతుందట. సమోసాను పాన్‌లో వేయించడానికి 90 నిముషాలకంటే ఎక్కువ సమయం పడుతుందని ముగ్గురు చెఫ్‌లు కష్టపడతారని దుకాణం యజమాని కౌశల్ చెబుతున్నారు. బంగాళా దుంపలు, బఠానీలు, మసాలాలు, పనీర్ మరియు డ్రై ఫ్రూట్స్‌తో నిండిన ఈ సమోసాను తినేందుకు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైతే 30 నిముషాల్లో 12 కిలోల సమోసాను తింటారో రూ.71,000 ఇచ్చేస్తారట. ఇక ఈ సమోసా కావాలంటే అడ్వాన్స్ ఆర్డర్లు మాత్రమే తీసుకుంటారట.
Nagpur man : అతను సమోసాలు ఎందుకు అమ్ముతున్నాడో తెలిస్తే కచ్చితంగా సపోర్ట్ చేస్తారు..
మొదట నాలుగు కిలోల సమోసాతో మొదలుపెట్టి.. తరువాత ఎనిమిది కిలోల సమోసా ప్రారంభించారట. ప్రస్తుతం అక్కడ 12 కిలోల సమోసా అమ్మకం పెడుతున్నారు. ఈ సమోసా ధర దాదాపుగా రూ.1,500. ఇప్పటి వరకూ ఈ సమోసా కోసం 40-50 ఆర్డర్లు వచ్చాయని కౌశల్ చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్ద సమోసాగా పేరు సంపాదించుకున్న ఈ సమోసా ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసి రూ.71,000 గెలుచుకోవాలంటే చలో మీరట్.