ఈబీసీ బిల్లు…. రాజ్యసభ వాయిదా

  • Publish Date - January 9, 2019 / 07:56 AM IST

ఢిల్లీ:ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం  బుధవారం రాజ్యసభలో ప్రవేశ  పెట్టింది. కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ  సమాజంలో ఆర్ధికంగా  వెనుకబడిన వర్గాలవారికి  చేయూతనిచ్చేందుకే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఐతే ముందుగా  సిటిజన్ షిప్ బిల్లు తేవాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమలను అడ్డుకున్నాయి. నిన్న లోక్ సభలో ఆమోదించిన బిల్లును పార్లమెంట్ సెలక్ట్  కమిటీకి పంపాలని డీఎంకే డిమాండ్ చేసింది. కాగా బిల్లుకు సవరణలు చేయాలని డీఎంకే ఎంపీ కనిమెళి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ,డీఎంకే సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగటంతో సభలో  గందరగోళం ఏర్పడింది. సభ్యులు ఎంతసేపటికీ శాంతించక పోవటంతో సభను 2గంటలకు వాయిదా వేశారు.