లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు EC ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11, 18, 23, 29, మే 06, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం కుదరదు. 2014లో జరిగిన ఎన్నికల్లో మొదట విడత పోలింగ్‌కు రోజునే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఓటర్లపై ప్రభావం చూపే విధంగా ఉందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో తుది నిర్ణయం తీసుకొనేందుకు ఈసీ ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. పోలింగ్‌కు 72 గంటల ముందు పార్టీలు మేనిఫెస్టో ప్రకటించడం సరికాదని ప్రత్యేక కమిటీ ఇటీవలే తన అభిప్రాయాన్ని ఈసీకి తెలియచేసింది. దీనిని ఇప్పుడు 48గంటలకు ఫైనల్ చేశారు.