ఈసీ దూకుడు : కర్నాటక, ఒడిషా సీఎంల హెలికాప్టర్‌లో తనిఖీలు

  • Publish Date - April 17, 2019 / 10:09 AM IST

ఎన్నికల వేళ ఈసీ దూడుకు పెంచింది. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. పోలీసుల వాహన తనఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండటంతో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లే లక్ష్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. కర్నాటకలో ఈసీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకంగా సీఎం కుమారస్వామి హెలికాప్టర్ లోనే తనిఖీలు చేశారు. శివమొగ్గలో ఎన్నికల ప్రచారం చేసేందుకు కుమారస్వామి వెళ్లారు. హెలికాప్టర్ ను ఈసీ స్క్కాడ్ చెక్ చేసింది. దీనిపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉన్న తాను కోడ్ కు విరుద్ధంగా పనులు ఎలా చేస్తానని ప్రశ్నించారు. తన చాపర్ లో చెక్కింగ్స్ చేయడాన్ని తప్పుపట్టారు. అటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చాపర్ లోనూ ఈసీ ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేసింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఈ చెక్కింగ్స్ చేసింది. మంగళవారం (ఏప్రిల్ 16,2019) కర్నాటక మాజీ సీఎం, బీజేపీ చీఫ్ యడ్యూరప్ప చాపర్ లోనూ ఈసీ తనిఖీలు చేసింది.

ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని, భారీగా డబ్బు పంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ధన ప్రవాహం అడ్డుకునేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. రాజకీయ నాయకులు, అభ్యర్థులు, మంత్రులే కాదు సీఎంను కూడా వదల్లేదు. డౌట్ వచ్చిన వారందరిని చెక్ చేస్తోంది. ఈసీ తనిఖీలపై కుమారస్వామి సీరియస్ అయ్యారు. రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మోడీ చెప్పినట్టు ఈసీ చేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే హసన్, మాండ్య పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మంత్రుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో చెక్కింగ్స్.. ఇవన్నీ కర్నాటక రాజకీయాలను వేడెక్కించాయి. ఏప్రిల్ 18వ తేదీన దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది.