ED issues summons : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఆరవసారి సమన్ల జారీ

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.....

chief minister Hemant Soren

ED issues summons : జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరవసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో భూమి అమ్మకం, కొనుగోలు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోసారి సమన్లు పంపింది.

ALSO READ : Telangana Minister Seethakka : అడవి బాట నుంచి అమాత్యురాలిగా…సీతక్క వినూత్న రాజకీయ ప్రయాణం

ముఖ్యమంత్రి సోరెన్ మంగళవారం రాంచీలోని ఈడీ ఏజెన్సీ జోనల్ కార్యాలయంలో హాజరయ్యే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. ఐదవ సమన్లను వ్యతిరేకిస్తూ సోరెన్ వేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది.

ALSO READ : Telangana : కార్యరంగంలోకి దిగిన మంత్రులు…శాఖల వారీగా వేగిరంగా అభివృద్ధి పనులకు శ్రీకారం

దీనిపై ఆయన తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సోరెన్ హైకోర్టు ఉత్తర్వులను ఇంకా సవాలు చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు