Mahagathbandhan: మరింత పెరిగిన మహాకూటమి బలం.. తాజాగా మరో 8 పార్టీల మద్దతు

గత నెల 23వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తదుపరి సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది

Bangalore: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 15 పార్టీలతో ఏర్పాటైన మహాకూటమి (Mahagathbandhan) రెండవ సమావేశం బెంగళూరులో ఈ నెల 17, 18వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో.. ఆ కూటమికి మరిన్ని విపక్ష పార్టీల మద్దతు లభించింది. బీజేపీని ఓడించేందుకు తాము కూడా సిద్ధమని, అందుకు చేతులు కలుపుతామని ముందుకు వచ్చాయి. కొత్త చేరబోయే పార్టీలకు మరీ అంత ప్రాబల్యం లేకపోయినప్పటికీ.. చాలా స్థానాల్లో ఇవి గెలుపోటములను ప్రభావితం చేయగలవు. కాగా, తాజాగా మద్దతు తెలిపిన పార్టీలన్నీ దక్షిణాది పార్టీలు కావడం గమనార్హం.

Bengal Panchayat Polls: కౌంటింగ్ రోజు కూడా కొట్లాటే.. అల్లర్లతో అతలాకుతలం అవుతోన్న బెంగాల్

మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుదలై చిరుతైగళ్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ (AIFB), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు ఉన్నాయి. లోక్‌సభలో ఈ పార్టీలకు ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే ఎండీఎంకే, కేడీఎంకే, ఏఐఎఫ్‌బీ, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)లకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. వీసీకే, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్ (మణి)లకు లోక్‌సభలో ఒక్కో స్థానం చొప్పున ప్రాతినిథ్యం ఉండగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు లోక్‌సభలో 3 సీట్లు ఉన్నాయి.

Rakhi Sawant: రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు సూపర్ ఐడియా చెప్పిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్

ఇకపోతే, గత నెల 23వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తదుపరి సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. అయితే దాన్ని అనూహ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు మార్చారు. మొదట 14, 15 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల రిత్యా 17,18 తేదీలకు మార్చారు. కొత్త పార్టీల చేరికలతో రెండవ సారి తలపెట్టిన విపక్షాల సమావేశంలో 23 పార్టీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు