Maha vs Karnataka: కర్ణాటక తీరు దారుణం.. సరిహద్దు వివాదంపై తీర్మానం ఆమోదించిన మహారాష్ట్ర అసెంబ్లీ

వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం తీర్మానం చేసిందని, ఇంతకు ముందు రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు ఏం చేయలేకపోయారంటూ ఉద్ధవ్ థాకరేని ఉద్దేశించి విమర్శించారు.

Maha vs Karnataka: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కర్ణాటకలోని మరాఠీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అణచివేస్తున్నారని తీర్మానం ప్రవేశ పెట్టే సందర్భంలో సీఎం షిండే వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో కర్ణాటక తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. తీర్మానం ప్రవేశ పెట్టే ముందు నాగ్‫‭పూర్‭లోని విధాన సభ ముందు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. మరాఠీ సంప్రదాయ పాటలు పాడుతూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

Musa Hasahya: 12 భార్యలు, 102 సంతానం అంనతరం సంచలన ప్రకటన చేసిన ఓ వ్యక్తి

కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు మహారాష్ట్రలో కలపాలని, ఇందులో ఒక్క అంగుళం కూడా వదులుకునే ప్రసక్తి లేదని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినప్పటికీ ప్రభుత్వం చేసేది చేస్తుందని ముఖ్యమంత్రి షిండే అసెంబ్లీలో అన్నారు. బెళగావి, కర్వార్, బీదర్, నిపాని, బల్కి ప్రాంతాల్లోని 865 గ్రామాలను తీర్మానంలో ప్రస్తావించారు.

Rahul Gandhi To Lord Ram: రాహుల్ గాంధీ రాముడట, భారత్ జోడో యాత్ర రామాయణమట.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు

వాస్తవానికి ఈ విషయమై ప్రభుత్వం తీర్మానం చేయాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ థాకరే సోమవారం డిమాండ్ చేశారు. ఆమర్నాడే తీర్మానం చేయడం, అది అసెంబ్లీ ఆమోదం పొందడం గమనార్హం. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం తీర్మానం చేసిందని, ఇంతకు ముందు రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు ఏం చేయలేకపోయారంటూ ఉద్ధవ్ థాకరేని ఉద్దేశించి విమర్శించారు.

MCD Mayor Polls: బీజేపీ బిగ్ యూటర్న్.. ఎంసీడీ మేయర్ ఎన్నికలో ఆప్‭ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన కమల పార్టీ

ఇక వివాదాస్పద ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ థాకరే చేసిన వ్యాఖ్యలపై మంత్రి దీపక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థాకరే ఉద్దశమేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే దీనిపై సీఎం షిండే సమాధానం చెప్తారని ఆయన అన్నారు. ఇక తాజా తీర్మానంపై సీఎం షిండే స్పందిస్తూ ‘‘మాకు ఎవరి నుంచి సలహాలు అక్కర్లేదు. ఈ వివాదంపై మా వైఖరి మాకు తెలుసు. దీని మీద మేము తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నాం’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు