Rahul Gandhi To Lord Ram: రాహుల్ గాంధీ రాముడట, భారత్ జోడో యాత్ర రామాయణమట.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు

'భారత్ జోడో యాత్ర' సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ గురించి అడగ్గా, కోవిడ్‌పై కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన మార్గదర్శకం ఉండదని, సార్వత్రిక మార్గదర్శకాలను జారీ చేసినప్పుడల్లా పార్టీ నిబంధనలను అనుసరిస్తుందని ఖుర్షీద్ సమాధానం చెప్పారు.

Rahul Gandhi To Lord Ram: రాహుల్ గాంధీ రాముడట, భారత్ జోడో యాత్ర రామాయణమట.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు

Congress Leader Salman Khurshid Compares Rahul Gandhi To Lord Ram

Rahul Gandhi To Lord Ram: ‘‘భారత్ జోడో యాత్ర అనేది రామాయణ ఇతిహాసం లాంటిది, రాహుల్ గాంధీ అనే వ్యక్తి రాముడు, కాంగ్రెస్ అంటే భారతదేశం..’’ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ పోలికలివి. వాస్తవానికి రెండు రోజుల ముందే రాముడి అంశంలో అధికార పార్టీ బీజేపీతో కాంగ్రెస్ నేతలకు మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఖుర్షీద్ పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతున్న సందర్భంగా సోమవారం మీడియాతో ఖుర్షీద్ మాట్లాడుతూ ఇలా పోల్చారు.

Maha vs Karnataka: ఉద్ధవ్ థాకరే చేసిన డిమాండ్ మేరకు అసెంబ్లీ తీర్మానానికి సిద్దమైన సీఎం షిండే

“రాహుల్ గాంధీ మానవాతీతుడు. మేము చలిలో గడ్డకట్టకుపోయాం. పైగా జాకెట్లు కూడా వేసుకునే ఉన్నాం. కానీ అతను (రాహుల్) టీ-షర్టులోనే (అతని భారత్ జోడో యాత్ర కోసం) బయటకు వెళ్తున్నాడు. ప్రస్తుతం అతను ఒక యోగిలా ఉన్నాడు. తపస్య దృష్టితో కనిపిస్తున్నాడు’’ అని ఖుర్షీద్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘రాముడి పాదాలు చాలా దూరం వెళ్తాయి. కొన్నిసార్లు రాముడు అందుబాటులో ఆయన పాదరక్షల్ని తీసుకుని భరతుడు వెళ్తాడు. అలాగే, మేము ఉత్తరప్రదేశ్‌లోకి రాముడి పాదరక్షల్ని తీసుకువచ్చాము. రాముడు (రాహుల్‌గాంధీ) కూడా తొందరలోనే వస్తాడు” అని అన్నారు.

Gujarat: ఆన్‭లైన్‭లో కూతురి అసభ్యకరమైన వీడియో.. ప్రశ్నించినందుకు ఆర్మీ జవాన్‭ను‭ కొట్టి చంపారు

‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ గురించి అడగ్గా, కోవిడ్‌పై కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన మార్గదర్శకం ఉండదని, సార్వత్రిక మార్గదర్శకాలను జారీ చేసినప్పుడల్లా పార్టీ నిబంధనలను అనుసరిస్తుందని ఖుర్షీద్ సమాధానం చెప్పారు.

Musa Hasahya: 12 భార్యలు, 102 సంతానం అంనతరం సంచలన ప్రకటన చేసిన ఓ వ్యక్తి

“ఈ దేశానికి ఏదైనా సైంటిఫిక్ ప్రోటోకాల్ వర్తింపజేస్తే, అది అందరికి వర్తిస్తుంది, మాకు కూడా వర్తిస్తుంది. కానీ కోవిడ్-19 అనే ప్రొటోకాల్ పెట్టి అది కాంగ్రెస్‌కు వస్తుందని, బీజేపీకి వర్తించదని చెప్పొద్దు. ఎవరైనా ప్రోటోకాల్ పాటిస్తే, మేము కూడా పాటిస్తాం’’ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారీ ప్రచార కార్యక్రమం భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం దేశ రాజధానికి చేరుకుంది. అనంతరం ఎర్రకోట వద్ద భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించారు. ఇది పార్టీకి కొత్త ఊపునిచ్చిందని అంటున్నారు.