కోయంబత్తూరు లో 149 కేజీల బంగారం స్వాధీనం :ఎన్నికల తనిఖీలు 

తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.

  • Publish Date - April 6, 2019 / 07:30 AM IST

తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని  సింగనల్లూరు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని మీనా ఎస్టేట్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓవ్యాన్ లో తరలిస్తున్న 149 బంగారం బిస్కట్లు బయటపడ్డాయి.
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి ​​​​​​​

ఇవి ఒక్కోక్కటికి కిలో బరువు ఉన్నాయి. వీటి విలువ సుమారు 48 కోట్ల రూపాయలు గా అంచనా వేస్తున్నారు. బంగారం తరలిస్తున్న వ్యాన్ ను సీజ్  చేసిన అధికారులు, వ్యాన్ డ్రయివర్ ను బంగారం తరలిస్తున్నఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఈ బంగారం  నగరంలోని బంగారం వర్తకులకు చెందినదిగా ఆ వ్యక్తులు చెపుతున్నారు.  స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సింగనల్లూరు అసెంబ్లీ పరిధిలోని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుకు అప్పచెప్పి ఆదాయ పన్ను శాఖ, కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. తమిళనాడు రాష్ట్రంలో  ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున బంగారం నగదు పట్టుబడటం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 
Read Also : ఎన్నికల బరిలో నేరచరితులు : 213 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు