7 విడతల్లో పోలింగ్ 

  • Publish Date - March 10, 2019 / 12:30 PM IST

ఢిల్లీ : 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ ఆరోరా మార్చి 10, 2019న ఢిల్లీ లో ప్రకటించారు.  దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలు 2019   ఏప్రిల్ 11 నుండి మే 19  వరకు  మొత్తం 7 దశల్లో నిర్వహిస్తారు.  23 మే ,2019న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. 

1. మొదటి విడత పోలింగ్  11-4-2019 న  91 స్దానాలకు 20 రాష్ట్రాల్లో  పోలింగ్ జరుగుతుంది.
2. రెండో విడత పోలింగ్- 18-4-2019 న 97 స్ధానాలకు 13 రాష్ట్రాల్లో జరుగుతుంది.
3. మూడో విడత పోలింగ్- 23-4-2019 న  115 స్ధానాలకు  14 రాష్ట్రాల్లో జరుగుతుంది.
4. నాలుగో విడత పోలింగ్- 29-4-2019 న  71 స్దానాలకు  9 రాష్ట్రాల్లో జరుగుతుంది.
5. ఐదో విడత పోలింగ్- 06-05-2019 న 51 స్ధానాలకు  7 రాష్ట్రాల్లో జరుగుతుంది.
6. ఆరో విడత పోలింగ్- 12-05-2019 న 59 స్ధానాలకు 7రాష్ట్రాల్లో జరుగుతుంది.
7. ఏడో విడత పోలింగ్- 19-05-2019 న 59 స్దానాలకు  8 రాష్ట్రాల్లో జరుగుతుంది. 

ట్రెండింగ్ వార్తలు