MP Salary Per Month : లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జీతం ఎంత? అలవెన్సులతో కలిపి నెలకు ఎంత వస్తుందో తెలుసా?

MP Salary Per Month : పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీలకు అందే సౌకర్యాలు ఏంటి? ఎంత జీతం? అలవెన్సుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

MP Salary Per Month : 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశ పౌరులు తమ విలువైన ఓటు హక్కుతో తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 293 సీట్లు దాటగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి 232 సీట్లను సాధించి గట్టి పోటీనిచ్చింది.

లోక్‌‌సభ ఎంపీలుగా గెలిచిన వారంతా పార్లమెంటులో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త పార్లమెంటు సభ్యులు (MP) ఎన్నికైన స్థానాల్లో కూర్చోబోతున్నారు. అయితే, సాధారణంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు మన ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు.

Read Also : NDA Alliance : ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌

అన్ని ఉద్యోగాల మాదిరిగానే ఎంపీ పదవి కూడా ఒక ఉద్యోగం లాంటిదే. దేశ పౌరుల కోసం నిరంతరం పనిచేసే ప్రజాప్రతినిధులు కూడా జీతం తీసుకుంటారు. ఎంపీలకు కూడా నెలనెలా జీతం అందుతుంది. అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో పార్లమెంటుకు ఎన్నికైన ఎంపీలకు నెలకు జీతం వస్తుంది.

ఇంతకీ, మన ప్రజా ప్రతినిధులకు నెలకు ఎంత జీతం వస్తుందో తెలుసా? కేవలం జీతం మాత్రమే కాకుండా ఎంపీలకు ఇతర సౌకర్యాలు, అలవెన్సులు కూడా ఉంటాయి. పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీలకు అందే సౌకర్యాలు, జీతాలు, అలవెన్సుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంపీల జీతాలు :
ప్రజాసేవ చేసేందుకు చట్టసభల్లో అడుగుపెడితే ప్రతి పార్లమెంట్ సభ్యునికి నెలకు అక్షరాలా రూ. లక్ష జీతం వస్తుంది. ద్రవ్యోల్బణం రేట్లు, పెరుగుతున్న జీవన వ్యయంతో ఎంపీల జీతాలను ఇటీవల భారీగా పెంచేశారు.

ఎంపీలకు ప్రతినెలా అందే అలవెన్సులు, ప్రోత్సాహకాలివే :

నియోజకవర్గ అలవెన్సులు : 
పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పటినుంచి నియోజకవర్గ అలవెల్స్ మాదిరిగా నెలకు రూ. 70వేలు అందుకుంటారు. ఆఫీసుల నిర్వాహణతో పాటు ఎన్నికల ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు సంబంధించిన ఖర్చుల కోసం వినియోగించేందుకు ఈ మొత్తాన్ని నెలవారీగా అలవెన్సులుగా అందుకుంటారు.

ఆఫీసు ఖర్చులు :
ఒక పార్లమెంటు సభ్యుడు తన ఆఫీసు ఖర్చుల కోసం నెలకు రూ.60వేలు అందుకుంటారు. ఇందులో స్టేషనరీ ఖర్చులు, టెలికమ్యూనికేషన్ సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి.

రోజువారీ ఖర్చులు :
పార్లమెంటరీ సెషన్‌లు, కమిటీ సమావేశాల సమయంలో ఎంపీలు బస, ఆహారానికి, రాజధానిలో ఉన్నప్పుడు ఏవైనా ఇతర ఖర్చులకు మొత్తంగా రూ. 2వేలు వరకు రోజువారీ ఖర్చులు కింద అందుకుంటారు.

ట్రావెల్ అలవెన్స్  :
ప్రతి ఎంపీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 34 సార్లు ఉచితంగా దేశంలో ఎక్కడికైనా విమాన ప్రయాణాలు చేయొచ్చు. అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫ్రీగా ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణాన్ని కూడా చేయొచ్చు. ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలో రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మైలేజ్ అలవెన్సులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

హౌసింగ్, వసతి :
ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే బంగ్లా తీసుకోవడం ఎంపీలకు ఇష్టం లేకపోతే.. హౌసింగ్, వసతి అలవెన్స్ కింద ప్రభుత్వం లక్షల రూపాయలను అందిస్తుంది. ఎంపీల 5 ఏళ్ల పదవీకాలంలో ప్రధాన ప్రాంతాల్లో రూపాయి కూడా అద్దె చెల్లించకుండా వసతి పొందవచ్చు. సీనియారిటీని బట్టి ఎంపీలు బంగ్లాలు, ఫ్లాట్లు లేదా హాస్టల్ గదులు పొందవచ్చు. అధికారిక వసతిని ఉపయోగించకూడదని భావిస్తే ఆయా ఎంపీలు నెలకు రూ. 2 లక్షల హౌస్ అలవెన్స్ కింద పొందవచ్చు.

వైద్య సదుపాయాలు :
ఎంపీలకు వైద్యపరమైన సౌకర్యాలు కూడా ఉంటాయి. అందులో వారితో పాటు ఎంపీల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఉచిత వైద్యాన్ని కూడా పొందవచ్చు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స, పథకం కింద వచ్చే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రూపాయి ఖర్చు లేకుండా చికిత్స పొందవచ్చు.

నెలకు పెన్షన్ ఎంతంటే? :
ఎంపీగా ఉన్నంతకాలం జీతం, అలవెన్సులతో పాటు ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మాజీ ఎంపీలు పెన్షన్ పొందవచ్చు. ఒకసారి పార్లమెంటులో పనిచేసిన తర్వాత నెలకు రూ. 25 వేలు పెన్షన్ పొందుతారు. ప్రతి అదనపు సంవత్సర సేవకు వారికి నెలకు రూ. 2వేలు ఇంక్రిమెంట్ అందుతుంది.

ఫోన్, ఇంటర్నెట్ సేవల వినియోగం :
ఎంపీలకు ఏడాదికి లక్షా 50వేల ఉచిత టెలిఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. తమ నివాసాలు, కార్యాలయాలలో ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను కూడా వినియోగించుకోవచ్చు.

వాటర్, విద్యుత్ వినియోగం :
ఎంపీలకు ప్రతి ఏటా 50వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు 4వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు వినియోగించుకోవచ్చు.

Read Also : పవన్‌ కల్యాణ్‌.. ఒక తుపాన్ అంటూ నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు

ట్రెండింగ్ వార్తలు