పవన్‌ కల్యాణ్‌.. ఒక తుపాన్ అంటూ నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు

Narendra Modi: ఏపీలో ఇంతటి ఘనవిజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు.

పవన్‌ కల్యాణ్‌.. ఒక తుపాన్ అంటూ నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు

Updated On : June 7, 2024 / 4:33 PM IST

Narendra Modi: ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం సాధించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన నాయకత్వాన్ని సమర్థిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన ఎన్డీఏ సమావేశంలో మోదీ మాట్లాడారు. మద్దతుగా నిలిచిన ఎన్డీయే మిత్రపక్షాలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. తమ కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుందని మోదీ చెప్పారు.

ఎన్డీఏ భారత ఆత్మగా నిలుస్తుందని తెలిపారు. పవన్‌.. ఒక తుపాన్ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీలో ఇంతటి ఘనవిజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షానికి ప్రజలు అధికారాన్నిచ్చారని చెప్పారు.

ఎన్డీఏ నేతలు విజయం సాధించి ఇక్కడికి వచ్చారని తెలిపారు. 2019లో ఎన్డీఏను బలపర్చారని, ఇప్పుడు మరోసారి ఎన్డీఏను మిత్రపక్షాలన్నీ బలపర్చాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరమని చెప్పారు. ఎన్డీఏ నేతలకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనని అన్నారు.

దేశాన్ని నడపాలంటే అందరి అంగీకారం అవసరమని తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమించారని అన్నారు. ఎన్డీఏ నేతలను చూస్తుంటే సుపరిపాలన గుర్తుకువస్తుందని చెప్పారు. దేశం కోసం ఈ కూటమికి ఎంతో నిబద్ధత ఉందని తెలిపారు.

Also Read: మోదీ సారథ్యంలో ఏపీలో సాధించాం: ఎన్డీఏ సమావేశంలో పవన్ కామెంట్స్