మోదీ సారథ్యంలో ఏపీలో సాధించాం: ఎన్డీఏ సమావేశంలో పవన్ కామెంట్స్
ఎన్డీఏకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ కూటమి నేతలు తీర్మానం చేశారు. పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు.

దేశానికి మోదీ ఓ స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్డీఏకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ కూటమి నేతలు తీర్మానం చేశారు. పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.
మోదీ సారథ్యంలో ఏపీలో 91 శాతం ఓట్లు సాధించామని పవన్ తెలిపారు. ఎంతో నిబద్ధతతో మోదీ పనిచేస్తారని చెప్పారు. ఆయన చేతలలోనూ ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఎన్డీఏకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటుకు ఎన్నికైన వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా, ఎన్డీఏకు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ రాజ్ నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. అందుకు ఎన్డీఏ నేతలు మద్దతు తెలిపారు. సంక్షేమం ఆశించే వ్యక్తి ప్రధాని అవుతున్నారని రాజ్ నాథ్ అన్నారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ప్రధానిగా మోదీ ఉంటారని అమిత్ షా చెప్పారు.
ఎన్డీఏ సమావేశంలో నరేంద్ర మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు