Bihar CM Nitish Kumar : బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు.. మొత్తం 26మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం..

Bihar CM Nitish Kumar : బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదో సారి.

Bihar CM Nitish Kumar : బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్.. సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరు.. మొత్తం 26మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం..

Bihar CM Nitish Kumar

Updated On : November 20, 2025 / 1:34 PM IST

Bihar CM Nitish Kumar : బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదో సారి. బీహార్ రాజధాని పాట్నాలోని ప్రఖ్యాత గాంధీ మైదాన్‌లో పెద్ద ఎత్తున జనం సమక్షంలో నితీష్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఎన్డీయే పక్షాల నేతలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, హర్యానా సీఎం నయాబ్ సింగ్ శైనీ, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ, నాగాలాండ్ సీఎం నీఫు రోయ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్క్రర్ సింగ్ ధామి హాజరయ్యారు. అలాగే, బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు.

మొత్తం 26మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 14మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా.. ఎనిమిది మంది జేడీ(యు) ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, హెచ్ఎఎం(ఎస్), ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున నితీశ్ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన బిహార్‌ కేబినెట్ మంత్రులు
సామ్రాట్ చౌదరి (బీజేపీ)
విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ)
దిలీప్ జైస్వాల్ (బీజేపీ)
మంగళ్ పాండే (బీజేపీ)
విజయ్ కుమార్ చౌదరి (జేడీయూ)
బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ)
శ్రావణ్ కుమార్ (జేడీయూ)
అశోక్ చౌదరి (జేడీయూ)
లేషి సింగ్ (జేడీయూ)
మదన్ సాహ్ని (జేడీయూ)
సునీల్ కుమార్ (జేడీయూ)
రామ్ కృపాల్ యాదవ్ (బీజేపీ)
సంతోష్ సుమన్ (బీజేపీ)
నితిన్ నబిన్ (బీజేపీ)
మహ్మద్ జమా ఖాన్ (జేడీయూ)
సంజయ్ సింగ్ టైగర్ (బీజేపీ)
అరుణ్ శంకర్ ప్రసాద్ (బీజేపీ)
సురేంద్ర మెహతా (బీజేపీ)
నారాయణ ప్రసాద్ (బీజేపీ)
రామ నిషాద్ (బీజేపీ)
లఖేంద్ర కుమార్ రోషన్ (బీజేపీ)
ప్రమోద్ కుమార్ (బీజేపీ)
సంజయ్ కుమార్ – LJP(RV)
సంజయ్ కుమార్ సింగ్ – LJP(RV)
సంతోష్ కుమార్ సుమన్ – HAM(S)
దీపక్ ప్రకాష్ – RLM

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకుగాను ఎన్డీయే కూటమి 202 సీట్లు దక్కించుకుంది. బీజేపీ 101 ఎమ్మెల్యేలను గెలుచుకోగా.. జేడీ(యూ) 85 చోట్ల విజయం సాధించింది.