×
Ad

Electric Car : బాబోయ్.. ఎలక్ట్రిక్ కారులో మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది.. అసలేం జరిగింది?

ఇలాంటి తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. Electric Car Fire

  • Published On : October 1, 2023 / 08:12 PM IST

Electric Car Fire (Photo : Google)

Electric Car Fire : బెంగళూరులో కలకలం రేగింది. నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రిక్ కారు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటల్లో కారు కాలిపోయింది. పూర్తిగా దగ్దమైపోయింది. మంటల్లో కారు కాలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మన దేశంలో ఈవీ వాహనాలు అమ్మకాలు జోరు మీదున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ లు, కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈవీ వెహికల్స్ సేఫ్టీ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా వాహనాలు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న తలెత్తుతోంది.

Also Read..Gujarat : జెయింట్ వీల్ ఎక్కుతున్నారా? మీ హెయిర్ లూజ్‌గా వదిలేసారో.. అంతే ! ఏమవుతుందో ఈ స్టోరీ చదవండి

ఎలిక్ట్రిక్ స్కూటర్స్ లో మంటలు చెలరేగిన ఘటనలు అనేకం జరిగాయి. ఈసారి ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగడం మరింత భయాందోళనకు గురి చేసింది. ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి కారు పూర్తి తగలబడిపోయిన ఘటన బెంగళూరు నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సెప్టెంబర్ 30వ తేదీన జేపీ నగర్ లో దాల్మియా సర్కిల్ లో ఈ ఘటన జరిగింది. అయితే కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నడిరోడ్డుపై కారు మంటల్లో కాలిపోవడం స్థానికులకు షాక్ కి గురి చేసింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ వచ్చింది. సడెన్ గా కారు నుంచి పేలుడు కూడా సంభవించింది. ఇదంతా కళ్లారా చూసిన వాళ్లు ఉలిక్కిపడ్డారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read..Viral Video : ప్రేమ కాదు.. పిచ్చికి పరాకాష్ట.. గాళ్ ఫ్రెండ్ చేయి కొరికిన చోట అతనేం చేసాడో చూడండి