Gujarat : జెయింట్ వీల్ ఎక్కుతున్నారా? మీ హెయిర్ లూజ్‌గా వదిలేసారో.. అంతే ! ఏమవుతుందో ఈ స్టోరీ చదవండి

గణేశ్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. సందడిగా జరుగుతున్న జాతరలో యువతీ, యువకులు జెయింట్ వీల్ ఎక్కారు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.

Gujarat : జెయింట్ వీల్ ఎక్కుతున్నారా? మీ హెయిర్ లూజ్‌గా వదిలేసారో.. అంతే !  ఏమవుతుందో ఈ స్టోరీ చదవండి

Gujarat

Gujarat : గుజరాత్‌లో గణేశ్ చతుర్థి వేడుకల సందర్భంలో బయటకు వచ్చిన ఓ వీడియో అందర్నీ షాక్‌కి గురి చేసింది. జాతరలో జెయింట్ వీల్ ఎక్కిన ఓ యువతి హెయిర్ చక్రంలో చిక్కుకుపోయింది. యువతి జుట్టు కత్తిరించి ప్రాణాలతో కాపాడారు.

Clay Pot Accident On Gas Stove : మట్టికుండలో వంట చేస్తుండగా ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

గుజరాత్‌లో ఓ యువతి తృటిలో ప్రాణాలతో బయటపడింది. ద్వారకా జిల్లాలోని జంభాలియా సిటీలో గణేశ్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో జరుగుతున్న జాతరలో జెయింట్ వీల్ ఏర్పాటు చేసారు. దీనిపై యువతీ, యువకులు ఉత్సాహంగా ఎక్కి సందడి చేస్తున్నారు. జెయింట్ వీల్ ఎక్కిన ఓ యువతి పొడవైన హెయిర్ లూజ్‌గా వదిలేసింది. రెండుసార్లు వీల్ తిరగగానే గాలికి ఆ అమ్మాయి జుట్టు చక్రంలో చిక్కుకుపోయింది. ఇక భయంతో యువతి కేకలు వేయడం ప్రారంభించింది. నిర్వాహకులు వెంటనే రైడ్‌ను నిలిపివేసారు. వెంటనే రియాక్టైన కొందరు యువకులు ఆ యువతి జుట్టును కత్తిరించి ప్రాణాలతో కాపాడారు.

China : రోలింగ్ మెషీన్‌లో పడి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మహిళ

@amazingdwarka అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో చూసిన వారు అవాక్కయ్యారు. సెప్టెంబర్ 21 న షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. జెయింట్ వీల్ ఎక్కేటపుడు ఆడవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియో సూచిస్తోందంటూ కామెంట్లు పెట్టారు. చాలామంది ఆడపిల్లలు హెయిర్ లూజ్‌గా వదిలేయాలని ఇష్టపడతారు. కొన్ని ప్రదేశాలకి వెళ్లినపుడు జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ వీడియో హెచ్చరిస్తోంది. సో.. లేడీస్ బీ కేర్ ఫుల్.

View this post on Instagram

 

A post shared by Dev Bhumi Dwarka District (@amazingdwarka)