Jammu And Kashmir: 75ఏళ్ల తరువాత ఆ గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు.. ఆనందంతో గ్రామస్తులంతా కలిసి..

విద్యుత్ సరఫరాకు కృషిచేసిన అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు. తొలిసారి ఇళ్లలో బల్బులు వెలుగడాన్ని చూసినవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామస్తులు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటిలోనే చార్జింగ్ పెట్టుకొనే సదుపాయం రావటంతో వారు ఆనందానికి అవధులులేవు.

Jammu And Kashmir: స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు లేవు. రాత్రి అయితే విద్యుత్ దీపాల మధ్య వారి జీవనం. తాజాగా ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా కావటం, ఇళ్లలో బల్బులు వెలుగుతుండటంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ముందు యువత నృత్యాలు చేసి తమ ఆనందాన్ని తెలుపుగా, గ్రామస్తులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి గ్రామంకు విద్యుత్ అందించిన అధికారులను సన్మానించారు. పూలమాలవేసి, అక్రోట్లను, బాదంపప్పులను అందించి తమ సంతోషాన్ని తెలిపారు.

 

jammu and kashmir

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని మారుమూల టెథాన్‌టాప్ గుర్జర్ టౌన్‌షిప్‌లో తొలిసారి విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని గ్రామాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. అయితే ప్రధానమంత్రి వికాస్ యోజన కింద ఈ గ్రామానికి అధికారులు విద్యుత్ అందించారు. ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేసి అన్ని అడ్డంకులను అధిగమించి స్థానికులకు విద్యుత్ అందించారు.

 

Tribal village in South Kashmir

విద్యుత్ సరఫరాకు కృషిచేసిన అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు. తొలిసారి ఇళ్లలో బల్బులు వెలుగడాన్ని చూసినవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు బల్బు వెలుతురులో చదవడం, రాయడం చేస్తున్నారు. గతంలో గ్రామస్తులు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటిలోనే చార్జింగ్ పెట్టుకొనే సదుపాయం రావటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు