Viral Video : బాహుబలి ఏనుగు…వరదల్లో 3 కిలోమీటర్లు ఈది మావటి ప్రాణాలు కాపాడింది

వైశాలి జిల్లా   రాఘవాపూర్ లో గంగానది ప్రవహిస్తోంది. ఒక ఏనుగుతో మావటివాడు గంగానదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లే సరికి గంగానదికి ప్రవాహం పెరిగింది.

Elephant In Ganga River Bihar

Viral Video :  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. వరదలతో పలు నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని పలువురు ఇబ్బందులు పడుతున్న  సంగతి తెలిసిందే.  బీహార్ లోని గంగా  నదికీ వరదలు వచ్చాయి. ఆ వరదల్లో చిక్కుకున్న ఒక గజరాజు 3 కిలోమీటర్లు ఈదుకుంటూ వడ్డుకు చేరుకున్న  ఘటన వెలుగు చూసింది. ఏనుగు గంగానదిని ఈదుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైశాలి జిల్లా   రాఘవాపూర్ లో గంగానది ప్రవహిస్తోంది. ఒక ఏనుగుతో మావటివాడు గంగానదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లే సరికి గంగానదికి ప్రవాహం పెరిగింది.  ఏనుగు, మావటి వాడు గంగా  నదిలో చిక్కుకుపోయారు. రాన్రాను ప్రవాహం పెరగసాగింది. బలమైన అలల మధ్య ఏనుగు చెవిని పట్టుకుని మావటి దానిపై కూర్చున్నాడు.

ఏనుగు మునిగిపోతున్నా మళ్లీ పైకి వస్తూ అలా ఈదుతూనే ఉంది.  ఒక చోట కొంత మంది మనుషులను చూసిన మావటి   ఏనుగును అటు వైపు తిప్పగలిగాడు. ఏనుగు అటు వైపు ఈదుకుంటూ వచ్చి తన ప్రాణంతో పాటు మావటి ప్రాణాన్ని కాపాడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియోను చూసి ఏనుగు సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.