Elephant Attack : ఈ డ్రైవర్ ధైర్యానికి మెచ్చుకోవాలి.. ఏనుగు దాడి చేసినా సీట్లోంచి కదల్లేదు

త‌మిళ‌నాడు కోటగిరి సమీపంలోని మెల్తాత్తపల్లంలో బస్సుపై ఏనుగు విరుచుకుపడింది. అద్దాలను ధ్వంసం చేసింది. బస్సును బోల్తా పడేసేందుకు విఫలయత్నం చేసింది.

Elephant Attack : త‌మిళ‌నాడు కోటగిరి సమీపంలోని మెల్తాత్తపల్లంలో బస్సుపై ఏనుగు విరుచుకుపడింది. అద్దాలను ధ్వంసం చేసింది. బస్సును బోల్తా పడేసేందుకు విఫలయత్నం చేసింది. కోటగిరి నుంచి మెట్టుపాళ్యంకు ప్రభుత్వ ఉద్యోగులను తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మొదట ఓ సారి అద్దంపై దాడి చేసి పగలగొట్టింది ఏనుగు. ఆ సమయంలో డ్రైవర్ తన సీటు లోంచి లేవలేదు.

Read More : Woman Tied To Tree : తెలియని పురుషుడితో మాట్లాడిందని మహిళను చెట్టుకు కట్టేసి…..

ఆ తర్వాత మరోసారి దాడి చేసింది. ఏనుగు తన దంతాలతో బస్సుపై దాడి చేయడంతో బస్సు అద్దం పగిలింది. బస్సు కూడా కొంచం వెనక్కు కదిలింది. ఇక ఏనుగు రెండోసారి దాడి చేసే సమయంలో తన సీటులోంచి లేచి వెనక్కు వెళ్ళాడు డ్రైవర్.. అందరు వెనక్కు వెళ్లాలని ఉద్యోగులకు సూచించాడు. ఈ దృశ్యాలను బస్సులోని ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు.

Read More : Vikramarkudu 2 : ‘విక్రమార్కుడు 2’ వస్తుందా..?

ఈ సమయంలో డ్రైవర్ ఈ మాత్రం భయపడకుండా ఉండటం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో ఉద్యోగులను సురక్షితంగా మెట్టుపాళ్యం చేర్చాడు. అయితే.. గతంలో కూడా ఏనుగులు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని డ్రైవర్ తెలిపారు.

తాను తరచూ ఇదే మార్గంలో తిరుగుతానని, నిత్యం ఏనుగులను చూస్తూనే ఉంటానని.. అందుకే ఏనుగు దాడి చేసినా పెద్దగా భయపడలేదని డ్రైవర్ చెప్పారు. ఒక వేళ తాను భయపడి ఉంటే బస్సులోని ఉద్యోగులూ ఆందోళన చెంది కేకలు వేసేవారని.. అది ఏనుగును రెచ్చగొట్టినట్లు అవుతుందని అన్నారు. అప్పుడు అది దాడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. అందుకే ధైర్యంగా ఉన్నానని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు