నిప్పుతో సాగనంపారు: ఆర్మీ క్యాంటిన్‌లో ఏనుగు రచ్చ

ఆర్మీ క్యాంటిన్‌లోకి ఏనుగు చొరబడి నానా రచ్ఛ చేసింది. బెంగాల్‌లోని హసీమరా ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంటిన్‌లోకి ప్రవేశించిన ఏనుగు అక్కడి ఫర్నీచర్‌ను అటుఇటు విసిరేస్తూ హడావుడి చేసింది. ఒక కిచెన్ లోకి నడుచుకుంటూ ఖాళీ భోజనశాలలో ప్రవేశించడంతో స్థానికులు భయపడి దాక్కున్నారు. ప్రతిఘటించేందుకు ఎంత ప్రయత్నించినా సరే. ఆ ఏనుగు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంకా లోపలికి రావడంతో దాన్ని అక్కడి నుంచి తరిమేందుకు గానూ.. అట్ట ముక్కకు నిప్పు వెలిగించి బెదించారు.
From back home today. The jumbo just walked into the Hashimara Army Canteen… and it was complete madness. pic.twitter.com/4v8sgPjSbh
— Ananya Bhattacharya (@ananya116) November 30, 2019
చివరి ప్రయత్నంగా కర్రకు నిప్పు వెలిగించి బెదిరించడంతో ఏనుగు వెనక్కి తగ్గింది. ఆ నిప్పుతోనే బయటకు వెళ్లేంతవరకూ వెంబడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రాంతం భూటాన్ హసీమార నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈశాన్య రాష్ట్రాల్లో జనావాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం సాధారణమైపోయింది. నవంబరులో ఏనుగు ఒకే రాత్రి అయిదుగురిని చంపిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు దానిని బంధించే వరకు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. ఏడాది కాలంగా ఈశాన్య భారతంలో ఏనుగుల కారణంగా 211 మంది మరణించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.