ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. భారీ భద్రత మధ్య తరలింపు

దీంతో సమన్లతో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది ఈడీ అధికారుల బృందం.

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంటికి 12 మంది ఈడీ అధికారుల బృందం వెళ్లింది. దీంతో ఆయన ఇంటి ముందు హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ కేసు, జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.

దీంతో సమన్లతో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది ఈడీ అధికారుల బృందం. కేజ్రీవాల్ ను విచారించడానికి తాము వచ్చినట్లు ఈడీ చెప్పింది. సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు ఆయనను అదుపులోకి తీసుకుని సివిల్ లైన్స్ నుంచి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించింది ఈడీ. ఈ రాత్రికి ఈడీ కార్యాలయంలో కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. కవితతో కలిపి కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.

లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కి 9 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. అలాగే, జల్ బోర్డు మనీలాండరింగ్ కేసులో మార్చి 16న కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ కూడా వెళ్లారు.

కాగా, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కి ఇవాళ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.

ఆయన విచారణకు సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు. కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన రెండు-మూడు గంటలకే కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారలున్నాయని ఈడీ అధికారులు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన బృందంలోనూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఉన్నారు.

Pithapuram : టార్గెట్ పవన్ కల్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యేకు సీఎం జగన్ కీలక సూచన

 

ట్రెండింగ్ వార్తలు