జర్మనీ ఛాన్సలర్ కు రాష్ట్రపతి భవన్ లో గ్రాండ్ వెల్ కమ్

రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్రపతి భవన్ లోకి స్వాగతించారు.

రాష్ట్రపతి భవన్‌లో ఆమె సైనిక స్వాగతం అందుకున్నారు. భారత్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ఏంజెలా అన్నారు. చాలా దగ్గరి బంధాలతో జర్మనీ-భారత్ లింక్ అయ్యాయన్నారు.భారత్ కు,దాని భిన్నత్వంలోని ఏకత్వం పట్ల తమకు చాలా గౌరవం ఉందని ఆమె అన్నారు. ఏంజెలా పర్యటన సందర్భంగా భారత్-జర్మనీల మధ్య దాదాపు 20ఒప్పందాలు జరగనున్నట్లు సమాచారం. భారతదేశం- జర్మనీ చర్చల ఎజెండాలోని ప్రధాన అంశాలు.. నైపుణ్య అభివృద్ధి, వాతావరణం, కృత్రిమ మేధస్సు, స్థిరమైన అభివృద్ధి, భద్రత మరియు ఆర్థిక వ్యవస్థ. EU తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం.

ఢిల్లీలో ఇవాళ జరిగే ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(IGC)5వ మీటింగ్ ప్రధాని మోడీతో కలిసి ఏంజెలా పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఆమెు సమావేశమవుతారు. ఆ తర్వాత ప్రధాని మోడీని ఆయన నివాసం లోక్ కళ్యాన్ మార్గ్ లో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రేపు బిజినెస్ డెలిగేషన్ తో సమావేశం అనంతరం గురుగావ్ లోని ఓ జర్మనీ కంపెనీని ఆమె సందర్శిస్తారు. తిరిగి జర్మనీకి వెళ్లే ముందు ఢిల్లీ ద్వారకా మెట్రో స్టేషన్ ని కూడా ఆమె సందర్శించనున్నారు.