COVID-19: కర్ణాటకలో కొత్త కరోనా వేరియంట్.. థర్డ్ వేవ్‌కు కారణం అవుతుందా?

కరోనాకు సంబంధించిన ఈటా వేరియంట్ కేసు ఆగస్టు 5న కర్ణాటకలోని మంగళూరులో బయటపడింది. నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వ్యక్తిలో COVID-19 పాజిటివ్ రాగా.. ఆ వ్యక్తిలో ఈటా వేరియంట్ కనిపించింది.

Covid19

Karnataka: SARS-COV-2కు సంబంధించిన ఈటా వేరియంట్ కేసు ఆగస్టు 5న కర్ణాటకలోని మంగళూరులో బయటపడింది. నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వ్యక్తిలో COVID-19 పాజిటివ్ రాగా.. ఆ వ్యక్తిలో ఈటా వేరియంట్ కనిపించింది. అయితే, ఈటా వేరియంట్ బయటకి రావడం ఇదే మొదటిసారి కాదని, నిమ్హన్స్ ల్యాబ్ లో ఏప్రిల్ నెలలోనే గుర్తించారని రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ వి రవి వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో మిజోరంలో కూడా ‘ఈటా’ వేరియంట్‌ కేసు నమోదైంది

తొలిసారి 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ రోజుకో రూపం దాల్చుకుంటూ.. కొత్త వేరియంట్లతో జన్యుమార్పిడి చెందుతూ పంజా విసురుతోంది. ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరించింది. బ్రిటన్లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్’ భారత్‌లో ప్రవేశించింది. దేశంలో సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణం కాగా.. ఈటా వేరియంట్‌ థర్డ్ వేవ్‌కు కారణం అవుతుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

కర్ణాటకలోని మంగళూరులో ఈటా వేరియంట్‌కు గురైన వ్యక్తి చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. డెల్డా వేరియంట్‌తో పోలిస్తే, ఈటా వేరియంట్ అంత ప్రభావంగా లేదనేది నిపుణుల అభిప్రాయం. కర్ణాటకలో 77 శాతం ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంటే కారణం కాగా.. 1,413 కేసులకు గానూ 1,089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించారు.