Even my wife has not written me as many love letters says kejriwal to Delhi LG
LG vs Kejriwal: తరుచూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తాజాగా పారిశుధ్య కార్మికుల విషయమై ప్రభుత్వం లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ కేజ్రీ ప్రభుత్వానికి లేఖ రాయడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘‘మీరు రాసినన్ని ప్రేమ లేఖలు నా భార్య అయినా నాకు రాయలేదు’’ అని అన్నారు. కాగా, ఈ లేఖను ఆయన తిట్లతో పోల్చుతూ రోజూ ఎల్‌జీ తిడుతున్నన్ని తిట్లను తన భార్య అయినా తిట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ఈ విషయమై గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేజ్రీవాల్ స్పందిస్తూ ‘‘ఎల్‌జీ సార్ రోజు నన్ను తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టదు. గడిచిన ఆరు నెలల్లో ఆయన రాసినన్ని ప్రేమ లేఖలు కూడా నా జీవితం మొత్తంలో నా భార్య నాకు రాయలేదు. ఎల్‌జీ సార్.. కొంచెం చిల్ అవ్వండి. అలాగే మీ సూపర్ బాస్‌కు కూడా చెప్పండి. కొంచెం చిల్ అవ్వమని’’ అని ట్వీట్ చేశారు.
వీకే సక్సేనా ఇటీవల కేజ్రీవాల్‌కు రాసిన లేఖల్లో, గాంధీ జయంతినాడు రాజ్‌ఘాట్‌కు హాజరు కాకపోవడం గురించి ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్లను తొలగించడానికి అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతుండటం గురించి ప్రశ్నించారు. సక్సేనా, కేజ్రీవాల్ మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Mulugu Banned Currency : ములుగు జిల్లాలో పాత నోట్ల కలకలం.. రూ.1.65 కోట్ల విలువైన కరెన్సీ స్వాధీనం