Mulugu Banned Currency : ములుగు జిల్లాలో పాత నోట్ల కలకలం.. రూ.1.65 కోట్ల విలువైన కరెన్సీ స్వాధీనం

రద్దై, చెలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్లు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ములుగు జిల్లాలో చెలామణిలో లేని పాత 500, 1000 రూపాయల నోట్లు భారీగా పట్టుబడ్డాయి.

Mulugu Banned Currency : ములుగు జిల్లాలో పాత నోట్ల కలకలం.. రూ.1.65 కోట్ల విలువైన కరెన్సీ స్వాధీనం

Mulugu Banned Currency : రద్దై, చెలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్లు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ములుగు జిల్లాలో చెలామణిలో లేని పాత 500, 1000 రూపాయల నోట్లు భారీగా పట్టుబడ్డాయి. వెంకటాపురం సమీపంలో కారులో తరలిస్తున్న రూ.1.65 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

8మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పాత నోట్లను హైదరాబాద్ లో మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో కొన్ని దొంగ నోట్లు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగ నోట్లను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పప్పు, నాగేంద్ర బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వీరిద్దరి దగ్గర రూ.1.65 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. అందులో రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. డీమానిటైజేషన్ లో భాగంగా పాత నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికి పాత నోట్లు పెద్ద మొత్తంలో వీరి దగ్గర ఉన్నాయి. వీరిద్దరూ పథకం ప్రకారం వాటిని చెలామణి చేసి వాటి స్థానంలో కొత్త నోట్లు తీసుకోవాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా డబ్బుని హైదరాబాద్ కు తరలించి నోట్ల మార్పిడి చేయాలని ప్లాన్ చేశారు.

పైసా పెట్టుబడి లేకుండా ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనతో ముఠాగా ఏర్పడి ప్లాన్ చేశారు. అయితే, వారి ప్లాన్ సక్సెస్ కాలేదు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉన్నప్పటికి కొందరు వ్యక్తులు చేయలేదు. ఆ డబ్బుని తమతోనే ఉంచుకున్నారు. అలాంటి వ్యక్తుల దగ్గరి నుంచి రూ.1.65 కోట్లు సేకరించారు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి ఈ రద్దైన నోట్లను హైదరాబాద్ లో మార్పిడి చేయాలని ప్లాన్ చేశారు.