Delhi Covid Updates : ఢిల్లీలో ప్రతి నాల్గో శాంపిల్ కరోనా పాజిటివ్.. 24 గంటల్లో కొత్తగా 24,375 కేసులు

దేశరాజధాని ఢిల్లీలో సింగిల్ డేలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,375 కరోనా కేసులు నమోదయ్యాయి.

Every 4th sample in Delhi Covid positive : దేశరాజధాని ఢిల్లీలో సింగిల్ డేలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,375 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 8లక్షల 28వేలకు చేరినట్టు హెల్త్ డిపార్ట్ మెంట్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ 15,400 మందికిపైగా కరోనా బాధితులు కోలుకున్నారని, 167 మంది మృతిచెందారని పేర్కొంది. కరోనా మరణాల సంఖ్య దేశ రాజధాని ఢిల్లీలో 12వేలకు చేరగా.. రికవరీ, యాక్టివ్ కేసులు 746,239, 69,799గా నమోదయ్యాయి.

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 24.56శాతంగా ఉంది. గత ఏడాది కరోనా ఆరంభంతో పోలిస్తే.. ఇదే అత్యధికం. ప్రస్తుత కరోనా పాజిటివిటీ రేటు ప్రకారం.. ఢిల్లీలో ప్రతి నాల్గో కరోనా శాంపిల్ టెస్టింగ్ పాజిటివ్ గా తేలుతోంది. గత 24 గంటల్లో 99వేల 230 టెస్టులు నిర్వహించారు. అందులో 30,024 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, 69,206 RT-PCR/CBNAAT/TrueNat టెస్టులు ఉన్నాయి. ఇక కంటైన్మెంట్ జోన్లలో 11,235కు కేసులు పెరగగా.. 32,156 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సీజన్ సరఫరా, యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివిర్ కొరత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కోవిడ్ పరిస్థితులను మానిటరింగ్ చేస్తోంది.

అవసరమైన చర్యలు చేపడుతోంది. రాత్రి సమయాల్లో నైట్ కర్ఫ్యూలు విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ తరహా కర్ఫ్యూలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి. ఇక వీకెండ్ కర్ఫ్యూలను విధించగా.. ఏప్రిల్ 16, రాత్రి 10 నుంచి ఏప్రిల్ 19, ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు