Arvind Kejriwal
Arvind Kejriwal : త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి పార్టీలు. గోవాలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు
గోవాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 13 పాయింట్లతో అజెండా తీసుకొచ్చారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే గోవా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్య ఆర్థిక సాయం చేస్తామన్నారు. 24 గంటలు విద్యుత్, మంచి నీటి సరఫరా, ఉచిత విద్య అందిస్తామన్నారు కేజ్రీవాల్. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోవాలోని రోడ్లకు మరమ్మత్తులు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన, ఉచిత నిర్భంధ విద్య అందిస్తామని ప్రకటించారు.
Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!
ఆప్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ద్వారా గోవాలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందుతాయని, అలాంటప్పుడు రూ.2వేలు తీసుకొని ఇతర పార్టీలకు ఓటు వేయడమెందుకని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 40 నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి. పశ్చిమబెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో గోవా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ఆప్ మేనిఫెస్టో..
* అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తాం
* రైతులతో చర్చించి వారి సమస్యలనూ తీరుస్తాం
* ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్స్ ప్రారంభించి ప్రజలకు ఉచిత వైద్య సేవలు