EVMలు కాదు..MVM లు (మోడీ ఓటింగ్ మెషిన్) – రాహుల్ గాంధీ

  • Publish Date - November 4, 2020 / 03:42 PM IST

MVM – Modi Voting Machine : ఈవీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. అవి ఈవీఎంలు కాదు, ఎంవీఎంలు..(మోడీ ఓటింగ్ మెషిన్) అంటూ సెటైర్స్ వేశారాయన. బీహార్ రాష్ట్రంలో ఈసారి యువకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ విజయం సాధించి తీరుతుందని స్పష్టం చేశారు. 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం Araria ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీపై విమర్శలు సంధించారు రాహుల్.



రైతులకు స్వేచ్చ ఇచ్చానని మోడీ చెబుతున్నారని, తాము పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకోవడానికి వీలుగా చట్టాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే..రైతులు తమ పంటలను విమానంలో తీసుకెళ్లి అమ్మాలా అంటూ ఎద్దేవా చేశారాయన. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే…బీహార్ లో రోడ్లు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు.



బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మూడు విడతల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా..ఆ రాష్ట్రంలో రెండు విడుతల పోలింగ్ ముగిసింది. 2020, నవంబర్ 07వ తేదీన మూడో విడత పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి.



రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. Bihariganj in Madhepura, Araria ప్రాంతంలో నిర్వహించే ర్యాలీలు జరుగనున్నాయి. మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ కుమార్తె Subhashini Raj Rao (Bihariganj) బరిలో నిలిచారు. Araria నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్ Abdur Rahman బరిలో ఉన్నారు.