జేజేపీలో చేరిన వివాదాస్పద మాజీ జవాన్

 జవాన్లకు నాణ్యత లోపించిన ఫుడ్ ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ద్వారా వివాదం రేపిన BSF మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ జననాయక్ జనతా పార్టీ (JJP)లో చేరారు. ఆదివారం(సెప్టెంబర్-29,2019)ఢిల్లీలో జేడేపీ నేత దుష్యంత్ చౌతాలా సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు.

2017లో తేజ్ బహదూర్ యాదవ్.. సోషల్ వీడియో పోస్ట్ అనంతరం ఆయనను సర్వీసు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. బీఎస్‌పీ, ఎస్పీ, ఆర్ఎల్‌డీ ఉమ్మడి అభ్యర్థిగా వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని మోడీపై ఆయన పోటీకి దిగారు. అయితే అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. అవినీతి వల్ల కానీ, అవిధేయత వల్ల కానీ తాను ఆర్మీ నుంచి డిస్మిస్ కాలేదని తెలియజేసే సర్టిఫికెట్ సమర్పించలేదంటూ ఆయన నామినేషన్ పత్రాలను ఈసీ తోసిపుచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.