స్వామి అగ్నివేశ్…మేక వన్నె పులి : మాజీ సీబీఐ చీఫ్

ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే మాజీ సీబీఐ చీఫ్,రిటైర్డ్‌ పీఎస్‌ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ్నివేశ్‌‌పై ట్విట్టర్‌ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

స్వామి అగ్నివేశ్.. కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. హిందూ మతానికి మీరు అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను అంటూ నాగేశ్వర రావు ట్వీట్‌ చేశారు. ఆయన మరణాన్ని మంచి పనిగా పేర్కొన్నారు.


ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులతో పాటు డిపార్ట్‌మెంట్‌ కు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్… ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు అంటూ ట్వీట్‌ చేసింది.