Madhya pradesh: బీజేపీ బహిష్కృత నేత ఐదంతస్థుల హోటల్‌ను డైనమైట్‌తో కూల్చివేత..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిష్కృత నేత మిశ్రీ చంద్రగుప్తాకు చెందిన ఐదు అంతస్థుల హోటల్‌ను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా భవనాన్ని నిర్మాణం చేపట్టడంతో అధికారులు పేలుడు పదార్థాల సాయంతో ఈ భవనాన్ని కూల్చివేశారు.

Demolition of building

Madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిష్కృత నేత మిశ్రీ చంద్రగుప్తాకు చెందిన ఐదు అంతస్థుల హోటల్‌ను అధికారులు కూల్చివేశారు. ఇండోర్ నుంచి పేలుడు పదార్థాల బృందాన్ని రప్పించి సుమారు 12గంటలు శ్రమించిన అనంతరం ఐదు సెకన్లలో భవనాన్ని కూల్చివేశారు. ఈ భవనానికి రెండు అంతస్థుల నిర్మాణం వరకే అనుమతి ఉంది. కానీ ఐదు అంతస్థుల వరకు నిర్మాణం చేపట్టడంతో అధికారులు భవనాన్ని కూల్చివేశారు.

Madhya Pradesh: ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి.. ఓనర్‌పై చెప్పుతో దాడి చేసిన మృతుడి బంధువులు

గతనెల 23న బీజేపీ నేత మిశ్రీచంద్ గుప్తా సోదరుడు, మేనల్లుడు జగదీష్ యాదవ్ అనే యువకుడిని థార్‌తో చితకబాది హత్యచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మరణించిన వ్యక్తి స్వతంత్ర కౌన్సిలర్ మేనల్లుడు. దీంతో స్థానికంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మిశ్రీ చంద్ గుప్తాపై తీవ్ర విమర్శలు రావడంతో బీజేపీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. హత్యకేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

Madhya Pradesh: మద్యం మత్తులో యూనిఫామ్ తీసేసిన పోలీస్… వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ చేసిన అధికారులు

హోటల్ అక్రమంగా నిర్మించారని, ఎలాంటి అనుమతులు లేకుండా ఐదంతస్థులు నిర్మాణం చేశారంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం భవనం కూల్చివేతకు నిర్ణయం తీసుకుంది. దీంతో సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య ఆధ్వర్యంలో ఈ భవనాన్ని కూల్చివేశారు. ఇందుకోసం 80కిలోల గన్‌పౌడర్, 85 జెలెటిన్ రాడ్‌లను ఉపయోగించారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం ఓ సారి బాంబు బ్లాస్ట్ చేశారు. మరోసారి రాత్రి 8గంటల సమయంలో బ్లాస్టింగ్ చేయగా ఐదు సెకన్లలో హోటల్ నేలమట్టమైంది.