Rajgarh Flood Accident : ఘోర ప్రమాదం.. కాల్వలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి..
Flooded Drain Sweeps Away Van In Rajgarh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ కాలువలో పడి కొట్టుకుపోయింది.
- Harish Thanniru
- Updated on- August 10, 2026 / 04:56 PM IST
Flooded Drain Sweeps Away Van In Rajgarh
Rajgarh Flood Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరు ప్రమాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Also Read : Medico Priyanka : మెడికో ప్రియాంక మృతి.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. నిందితులను వదిలిపెట్టమన్న సీఎం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్‌గఢ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యాన్ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
రాజ్‌గఢ్ జిల్లాలోని పధానా బైపాస్ సమీపంలో పచోర్-సారంగ్‌పూర్ రహదారిపై ఈ ఘటన జరిగింది. సత్వాస్ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించేందుకు కద్నావద్ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్‌లో మొత్తం 11 మంది ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వరద ఉధృతి కారణంగా రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. ఈ సమయంలో డ్రైవర్ వ్యాన్‌ను రోడ్డును దాటించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్ధృతమైన నీటి ప్రవాహం వ్యాన్‌ను రోడ్డు పక్కనున్న లోతైన డ్రెయిన్‌లోకి లాగేసింది. క్షణాల్లోనే వాహనం నీటిలో మునిగిపోయింది.
వాహనాన్ని ముందుకు తీసుకెళ్లొద్దని డ్రైవర్‌ను హెచ్చరించినప్పటికీ వినకుండా రోడ్డును దాటించేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ముకేశ్, హుకుమ్‌సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఏడుగురు మృతదేహాలను వెలికి తీయగా.. మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు. వారి కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు, అధికారులు, స్థానికులు కలిసి గాలింపు చేపట్టారు.
Out of the 6 bodies retrieved so far by the SDERF personnel, two are women, one child and three men. Two others still missing. All deceased and missing belonged to a family in Dewas district. pic.twitter.com/4Av8msvmQi
— Anuraag Singh (@anuraag_niebpl) August 10, 2026
