కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.
కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు. కరోనాతో చనిపోలేదు..తీసుకపోవాలని చెబుతున్నా..పట్టించుకోవడం లేదు. తాజాగా కర్ణాటకలోని బెలగావి జిల్లా అథాని తాలూకాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఓ ఇంట్లో వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబసభ్యులు అందరికీ సమాచారం ఇచ్చారు. కానీ కరోనా భయంతో ఎవరూ చావుకు రాలేదు. అంతిమయాత్రకు సహకరించాలని ఇరుగుపొరుగును ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబసభ్యులే తోపుడు బండిపై శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
#WATCH Karnataka: Body of a man was carried on a cart by his family, for last rites, in Belagavi’s Athani Taluk after they allegedly received no help from anyone. They allegedly received no help from others following a suspicion that the deceased was COVID-19 positive. (17.07) pic.twitter.com/eRkeBDSB4v
— ANI (@ANI) July 18, 2020