Anand Mahindra : ముంబయిలో డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

డబుల్ డెక్కర్ బస్సులకు ముంబయి వాసులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసారు.

Anand Mahindra

Anand Mahindra : డబుల్ డెక్కర్ బస్సులకు ముంబయి పెట్టింది పేరు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉండే ఈ బస్సులు సంఖ్య తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ బస్సుల వాడకాన్ని నిలిపివేసారు. ఈ సందర్భంలో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ముంబయి బృహన్‌ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ (BEST) డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ చూసుకుంటోంది. 90 లలో 900 పైన డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతూ ఉండేవి. క్రమేణా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మూడు ఓపెన్ డబుల్ డెక్కర్ బస్సులతో సహా ఏడు డబుల్ డెక్కర్ బస్సులు మాత్రమే ఉన్నాయి. వీటిలో AC డబుల్ డెక్కర్ బస్సులను నిలిపివేసారు. మూడు ఓపెన్ డబుల్ డెక్కర్ బస్సులు అక్టోబర్ 5, 2023 నుంచి నిలిపివేయబడతాయి.

Lakshmi Manchu : ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.. మంచులక్ష్మి ట్వీట్ వైరల్

డీజిల్ ధరలు ఎక్కువ కావడంతో ఈ ఐకానిక్ బస్సులను నిలిపివేసారు. డీజిల్‌తో నడిచే బస్సుల కాల వ్యవధి కూడా 15 సంవత్సరాలు మాత్రమే. ఈ బస్సుల కాల వ్యవధి పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని నిలిపివేశారు. వీటి స్ధానంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం 25 వరకు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. వీటి ఖరీదు ఒక్కో బస్సుకి రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. డీజిల్ డబుల్ డెక్కర్ బస్సు ధర కేవలం రూ.30 లక్షల నుండి 35 లక్షలు ఉంటుంది.

ఈ బస్సులు నిలిపివేయడంపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు. ‘హలో, ముంబై పోలీస్? నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదాని దొంగతనం గురించి నేను నివేదించాలనుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేసారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

MS Dhoni : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని.. వీడియో వైరల్

కనీసం రెండు ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులను ముంబయి వారసత్వంగా భద్రపరచాలని ప్రయాణికుల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పర్యాటక శాఖ మంత్రి మరియు బెస్ట్ ఉన్నతాధికారులను కోరింది. 1937 లో ముంబయి రావాణా వ్యవస్థలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టారు. ఈ ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులు అనేక బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపిస్తాయి. ప్రస్తుతానికి ఇవి జ్ఞాపకాల్లోకి చేరిపోయాయి.