Rahul Gandhi : కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో లంచ్ చేసిన రాహుల్ గాంధీ వీడియో వైరల్

కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో రాహుల్ గాంధీ లంచ్ చేశారు. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అతనితో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలను రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.

Rahul Gandhi

Rahul Gandhi : ధరల పెరుగుదల కారణంగా తన దయనీయమైన పరిస్థితిని చెప్పిన రామేశ్వర్ అనే కూరగాయల వ్యాపారి వీడియో రీసెంట్‌గా వైరల్ అయ్యింది. అతనితో కలిసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భోజనం చేశారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. వీరు లంచ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rahul Gandhi : ప్రతి భారతీయుడి గొంతుగా భారత్ మాత…రాహుల్ గాంధీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఇటీవలే రామేశ్వర్ అనే రైతు కూరగాయల మార్కెట్లో ఖాళీ బండితో కనిపించాడు. కారణమేంటని మీడియా అడిగిన ప్రశ్నకు టమాటాలు ధర ఎక్కువగా ఉండటంతో తాను కొనలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పాడు. ఇంకేమైనా కూరగాయలు కొంటావా?  అని అడిగితే తన వద్ద డబ్బులు లేవని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు పెరుగుతున్న ధరలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంకా రామేశ్వర్ ఆ వీడియోలో తనకు రాహుల్ గాంధీని కలవాలని ఉందని చెప్పాడు. అతని కోరిక నెరవేరింది. రాహుల్ గాంధీ రామేశ్వర్‌ను పిలిపించి అతనితో కలిసి లంచ్ చేశారు. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్లో @RahulGandhi) షేర్ చేశారు.

Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చూడలేదు…ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు

‘రామేశ్వర్ జీ సజీవమైన వ్యక్తి! కోట్లాది భారతీయుల సహజ సిద్ధమైన స్వాభావం అతనిలో చూడవచ్చును. ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ముందుకు సాగేవారు నిజంగా ‘భారత్ భాగ్య విధాత’ ‘ అంటూ రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్లో హిందీలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నిజమైన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ’ అని.. ‘నిజమైన నాయకుడు మాత్రమే ప్రజల కష్టాలు తెలుసుకుంటాడు’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు.