Farmers Protest : ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న రైతులు.. ట్రాక్టర్లతో పార్లమెంట్ ముట్టడి

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసనలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నెల 29న పార్లమెంట్ కు కవాతు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Tractor March to Parliament : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసనలకు ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నెల 29న పార్లమెంట్ కు కవాతు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రోజు ఘాజీపూర్-టిక్రీ నుంచి పార్లమెంట్ వైపు తమ ట్రాక్టర్లు బయలుదేరుతాయని, ఎక్కడ ఆపితే అక్కడే కూర్చుంటామని ప్రకటించారు.

ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ రైతులు ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ప్రణాళిక రూపొందించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సదర్భంగా ప్రతిరోజూ 500 మంది రైతులతో పార్లమెంట్ మార్చ్ ఉంటుందని తెలిపారు.

UP Election : స‌మాజ్‌వాది పెర్ఫ్యూమ్‌ లాంఛ్ చేసిన అఖిలేష్..బీజేపీ పువ్వులో సువాసన లేదని విమర్శలు

శాంతియుతంగా ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నెల 26న రాష్ట్ర రాజధానుల్లో మహాపంచాయత్ ల నిర్వహించాలని నిర్ణయించారు. కాగా రైతుల ట్రాక్టర్ మార్చ్ కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఈ నెల 26 నాటికి రైతుల ఉద్యమం పూర్తికానుంది.

ట్రెండింగ్ వార్తలు