Farmers Protest: చలో ఢిల్లీ నిరసనను 2 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల ప్రకటన

హరియాణా సరిహద్దులోని ఖనౌరీ వద్ద హింస చెలరేగింది. 21 ఏళ్ల యువ రైతు..

Farmers Protest

Farmers Protest 2024: చలో ఢిల్లీ నిరసనను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. రేపు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి. శంభు, ఖనౌరీ శిబిరాల్లోనే రైతులు నిరసన తెలపనున్నారు.

నిన్న పంజాబ్, హరియాణా సరిహద్దులోని ఖనౌరీ వద్ద హింస చెలరేగింది. 21 ఏళ్ల యువ రైతు శుభ కరణ్ సింగ్ మృతి చెందడంతో కలకలం చెలరేగింది. ఆయన తలకి బులెట్ గాయం కావడంతో మృతి చెందారు. పోలీసుల కాల్పులవల్లే రైతు మృతి చెందాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఆందోళనకారుల రాళ్ల దాడిలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. రైతు శుభకరన్ మృతిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్‌ఎస్‌!

కాగా, కనీస మద్దతు ధర హామీకి చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, 2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసుల్ని కొట్టివేయాలని అంటున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు